వంటింట్లో ఠారెత్తున్న టమాటా

గత కొన్ని రోజులుగా టమాటా రేటు దిగిరావడం లేదు. ప్రభుత్వాలు టామాటా రేటు దిగి వస్తుందని చెబుతున్నా అది సాధ్యపడటం లేదు

Update: 2021-11-27 02:25 GMT

గత కొన్ని రోజులుగా టమాటా రేటు దిగిరావడం లేదు. ప్రభుత్వాలు టామాటా రేటు దిగి వస్తుందని చెబుతున్నా అది సాధ్యపడటం లేదు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర వందకు పైగానే పలుకుతుంది. కూరగాయలు కొనేందుకు వెళ్లిన వినియోగదారులు టమాటా రేటు చూసి కంగుతింటున్నారు. కనీసం రెండు కేజీలు కొనే వినియోగదారులు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు.

ధరలు దిగిరాకపోవడంతో....
మదనపల్లె మార్కెట్ లో టమాటా కిలో ధర 130 రూపాయలు పలికింది. టామాటా ధరలు దిగిరాకపోవడంతో ప్రభుత్వాలకు కూడా ఇబ్బందిగా మారింది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి 70 రూపాయలకు విక్రయిస్తుంది. అలాగే ఏపీలోనూ జగన్ ప్రభుత్వం రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి 60 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం మీద టమాటా చుక్కలు చూపుతుంది.


Tags:    

Similar News