విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు !

ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ గుంటూరు నుంచి విశాఖపట్నం, హైదరాబాద్‌ వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలను

Update: 2022-03-31 05:42 GMT

విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లీ బిడ్డ నూతన వాహనాలను ప్రారంభించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా.. చెన్నై నుంచి విజయవాడ మీదగా విశాఖపట్నం రాక పోకలను చీరాల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదగా దారి మళ్లించనున్నారు. ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌, నూజివీడు, జీ. కొండూరు, ఇబ్రహీంపట్నం మీదగా మళ్లించనున్నారు.

అలాగే ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ గుంటూరు నుంచి విశాఖపట్నం, హైదరాబాద్‌ వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలను ప్రకాశం బ్యారేజ్‌ మీదగా దారి మళ్లించనున్నారు. ఇదే సమయంలో కనకదుర్గమ్మ వారధిపై ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. తాడిగడప నుంచి కార్లు, ఇతర చిన్న వాహనాలు ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి పటమటలంక, రామలింగేశ్వర నగర్‌ మీదగా దారి మళ్లించనున్నారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి బందరు రోడ్డులో ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు. విజయవాడ బస్టాండ్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి సహకరించవలసిందిగా నగర ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News