National High Way : నేషనల్ హైవేపై విమానాలు ఎమెర్జెన్సీ ల్యాండింగ్.. నేడు ట్రయల్ రన్
అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులపై విమానాలు ల్యాండింగ్ కావడానికి అవసరమైన ట్రయిల్ రన్ ప్రారంభం కానుంది
అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులపై విమానాలు ల్యాండింగ్ కావడానికి అవసరమైన ట్రయిల్ రన్ ప్రారంభం కానుంది. ఈరోజు ఏపీలోని బాపట్ల జిల్లా కొరిశపాడు - రేణంగివరం మధ్య ఈ రన్ వే ను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా నేడు పదమూడు జాతీయ రహదారులపై ఈ అర్జంట్ ల్యాండింగ్ కోసం నేషనల్ హైవేలను ఎంపిక చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని...
ఈరోజు బాపట్ల జిల్లా కొరిశపాడు - రేణంగివరం మధ్య మూడు విమానాలు ల్యాండ్ అవ్వనున్నాయి. జాతీయ రహదారి సమీపంలో సిగ్నలింగ్ వ్యవస్థను, రాడార్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వరదలు, విపత్తుల సమయంలో ప్రజలకు సేవలందించేందుకు ఈ అత్యవసర ల్యాండింగ్ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావించి పదమూడు ప్రాంతాలను దేశంలో ఎంపిక చేసింది.