Train accident : ఏపీలో రెండు రైళ్లు ఢీ - ఆరుగురి మృతి

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు

Update: 2023-10-29 15:58 GMT

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పట్టాలపై ఆగిఉన్న రైలును మరో రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగింది. విజయనగరం జిల్లాలలోని కొత్తవలస మండలం అలమండ - కంటకాపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పట్టాలపై సిగ్నల్ లేకపోవడంతో ఒక రైలు ఆగి ఉంది. ఆగి ఉన్న రైలును మరొక రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాు.

ఒక రైలును మరో రైలు...
ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే డీఎఆర్ఎం మీడియాకు తెలిపారు. విద్యుత్తు వైర్లు తెగిపడటంతో అక్కడ చీకట్లు అలుముకున్నాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. అంధకారం కావడంతో టార్చి లైట్లు, సెల్ ఫోన్ లైట్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. చినరావులపల్లి వద్ద జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని కోరారు.
హెల్ప్ లైన్ ఏర్పాటు...
మరోవైపు ఈ ప్రమాదంపై ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బాధితులు సహాయ సమాచారం కోసం కలెక్టర్కార్యాలయం హెల్ప్ లైన్ నెంబరు 8978080006, 9493589157 లకు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. బాధితులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేపట్టనున్నామని తెలిపారు. గాయపడని వారిని వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.


Tags:    

Similar News