రాజధాని అంశం వేరే బెంచ్ కు బదిలీ

అమరావతి రాజధాని అంశంపై వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ చీఫ్ జస్టిస్ యు.యు. లలిత్ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2022-11-01 07:41 GMT

అమరావతి రాజధాని అంశంపై వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ చీఫ్ జస్టిస్ యు.యు. లలిత్ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే పిటీషన్లపై విచారణకు సీజేఐ లలిత్ విముఖత చూపారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని ఆయన ఆదేశించారు.

చీఫ్ జస్టిస్ నిరాకరించడంతో...
అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారించేందుకు జస్టిస్ యు.యు.లలిత్ నిరాకరించారు. దీంతో ఈరోజు రాజధాని అమరావతి పిటీషన్లపై ఎలాంటి విచారణ జరగకుండానే ముగిసింది.


Tags:    

Similar News