అవినీతి కేసు: చంద్రబాబు మిత్రుడు ఈశ్వరన్ అరెస్ట్

చంద్రబాబు మిత్రుడు, సింగపూర్‌ రవాణాశాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పు

Update: 2023-07-15 03:07 GMT

చంద్రబాబు మిత్రుడు, సింగపూర్‌ రవాణాశాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పుకున్న ఈశ్వరన్‌ను జూలై 11న అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యాడని అత్యున్నత దర్యాప్తు సంస్థ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (సీపీఐబీ) శుక్రవారం వెల్లడించింది.

భారత సంతతికి చెందిన సింగపూర్ మంత్రి ఎశ్ ఈశ్వరన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సింగపూర్ రవాణా మంత్రిగా ఉన్న ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మంత్రి ఈశ్వరన్‌ని విచారించేందుకు కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (సీపీఐబీ) అనుమతినివ్వాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రధాని లూంగ్ విచారణకు అనుమతినిచ్చారు. ఈ కేసులో నిందితులెవరైనా సరే ఖచ్చితంగా విచారణ జరిగి తీరుతుందని.. అప్పటి వరకూ ఈశ్వరన్ లాంగ్‌ లీవ్ తీసుకోవాలని ఆదేశించారు. ఈశ్వరన్ ను పక్కన పెట్టి తాత్కాలికంగా రవాణా మంత్రిగా వేరే వ్యక్తిని నియమించారు. మంత్రి ఈశ్వరన్‌ కొన్ని అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించిన సీపీఐబీ.. ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ను అరెస్ట్ చేసింది.
ఎస్ ఈశ్వరన్ 1997లో సింగపూర్‌లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరవాత 2006లో క్యాబినెట్‌లో చోటు దక్కింది. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సింగపూర్‌ని రీబిల్డ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని.. కోవిడ్ సంక్షోభం తరవాత సింగపూర్‌ని ఎయిర్ హబ్ గా మార్చడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారని చెబుతూ ఉంటారు. ట్రేడ్ రిలేషన్స్‌లోనూ మినిస్టర్ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. ఇప్పుడు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే మాత్రం కఠిన చర్యలు తీసుకోనున్నారు. 2025లో సింగపూర్‌లో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అధికారంలో ఉన్న పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేసింది.


Tags:    

Similar News