ఏబీఎన్, మహా టీవీలు బరితెగించాయా?

అవినాశ్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా

Update: 2023-06-01 02:19 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తూ ఉంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ జస్టిస్ లక్ష్మణ్‌ ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలను నిర్వహించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చర్చా కార్యక్రమాలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని జస్టిస్‌ లక్ష్మణ్‌ తెలిపారు. ఆ ప్రసారాలకు సంబంధించిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. మీడియాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ అది ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఉండాలని, అంతేతప్ప నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. టీవీల్లో చర్చల సందర్భంగా కొంతమందిని ఎంపిక చేసుకుని వారి ద్వారా న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం చేయిస్తున్నారని జస్టిస్‌ లక్ష్మణ్‌ అన్నారు. తద్వారా న్యాయమూర్తిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని అన్నారు. కొందరి వ్యవహార శైలి వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారే పరిస్థితి వచ్చిందన్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిటిషన్పై విచారణ అనంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ ఎం. లక్ష్మణ్ బుధవారం తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఆ రెండు టీవీ చానెళ్లు చేసిన ప్రసారాలను న్యాయమూర్తి తప్పుబట్టారు. 'ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న మీడియాపై నాకు గౌరవం ఉంది. మీడియా స్వేచ్ఛకు నేను అడ్డంకి కాదు. వారికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అయితే అది చర్చల పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. తనపై చేసిన కామెంట్లు తీవ్రంగా బాధించడంతో ఒక దశలో విచారణ నుంచి వైదొలగాలని భావించానని, అయినా సుప్రీంకోర్టు ఆదేశాలతోపాటు న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణ కొనసాగించానని తెలిపారు. ఛానల్స్ లో వచ్చిన డిబేట్లు కచ్చితంగా కోర్టు ధికరణ కిందికే వస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్నది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే నిర్ణయిస్తారని జస్టిస్‌ లక్ష్మణ్‌ తెలిపారు.


Tags:    

Similar News