సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై విచారణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నంల ధర్మాసనం ముందు పిటీషన్ ను విచారించనున్నారు. అమరావతి పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.
రెండు పిటీషన్లను..
అదే సమయంలో అమరావతి రైతులు కూడా హైకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరుతూ పిటీషన్ దాఖలయింది. ఈ రెండు పిటీషన్ లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎలాంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వెలువడనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.