2022-23 ఆర్థిక సంవత్సరంలో తిరుమల హుండీ ఆదాయ వివరాలు

2022 జనవరి నుండి డిసెంబరు వరకు 2.37 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ 1,450 కోట్లు..

Update: 2023-04-01 06:16 GMT

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి హుండీలకు కాసుల వర్షం కురుస్తోంది. మార్చి నెలలో కూడా భారీగా ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెల సుమారు రూ.100 కోట్లకు పైగానే హుండీ ఆదాయం సమకూరుతోంది. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగియగా.. 2022-23 తిరుమల దేవస్థాన హుండీ ఆదాయ వివరాలను టీటీడీ అధికారులు తెలిపారు. 022-23 ఆర్థిక సంవత్సరంకుగాను తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 1,520.29 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగిందని పేర్కొన్నారు. కరోనా తర్వాత పూర్తిస్థాయిలో స్వామివారి దర్శనానికి అనుమతులివ్వడంతో మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. 2022 జనవరి నుండి డిసెంబరు వరకు 2.37 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ 1,450 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు. గతేడాది ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.140.34 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ 1.04 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. రూ.833.41 కోట్లు ఆదాయం సమకూరింది.




Tags:    

Similar News