TTD: తిరుమల అన్నదానంలో జెర్రి.. అది దుష్ప్రచారం అంటూ కొట్టేసిన టీటీడీ

తిరుమలలో అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ

Update: 2024-10-05 15:13 GMT

తిరుమలలో అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ భక్తులు ఆరోపించగా.. ఆ ఆరోపణలపై టీటీడీ స్పందించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదములో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరమని టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ అన్నప్రసాదాలను తయారుచేయిస్తుంది. అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరంగా ఉందని టీటీడీ వివరించింది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రి ఉండటం అనేది కావాలని చేసిన ఆరోపణలుగా మాత్రమే గా భావించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగన్నంలో జెర్రి కనిపించిందంటూ భక్తులు ఆరోపించారు. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనిపించడంతో టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి భక్తులు డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని టీటీడీ చెబుతోంది.


Tags:    

Similar News