తుంగభద్ర నుంచి ఒక్కసారి వచ్చి పడుతున్న లక్ష క్యూసెక్కులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హైఅలెర్ట్

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. వరదలకు డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో నీరంతా కిందకు పారుతుంది

Update: 2024-08-11 05:59 GMT

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. వరదలకు డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో నీరంతా కిందకు పారుతుంది. దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు కిందకు రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే అవకాశాలున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హోస్‌పేట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో తుంగభద్ర డ్యామ్ కు ఉన్న 19వ గేటు కొట్టుకుపోయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డ్యామ్ గేటు కొట్టుకుపోయిందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.

సుంకేశుల ప్రాజెక్టుకు...
తుంగభద్ర నుంచి విడుదలయిన నీరు సంకేశుల ప్రాజెక్టుకు చేరుతుంది. దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీరు చేరడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై అధికారులతో సమీక్షించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి నష్టం ఉండకుండా చూడాలని కోరారు.


Tags:    

Similar News