Devaragattu : బన్నీ ఉత్సవంలో విషాదం : ఇద్దరి మృతి
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఇద్దరు మృతి చెందారు. అయితే కర్రల సమరంలో ఈ ఇద్దరు మృతి చెందలేదు.
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఇద్దరు మృతి చెందారు. అయితే కర్రల సమరంలో ఈ ఇద్దరు మృతి చెందలేదు. బన్నీ ఉత్సవాన్ని చూసేందుకు చెట్టు ఎక్కి అది కూలడంతో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పరికి చెందిన గణేష్, కమ్మరపాడుకు చెందిన రామాంజనేయులు ఈ ఉత్సవంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏటా దసరా పండగ మరుసటి రోజు కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి మూడు గ్రామాల ప్రజలే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కాకుండా కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో ప్రజలు చూసేందుకు తరలి వచ్చారు. అయితే ఈ ఉత్సవంలో ఇద్దరు మరణించడంతో విషాదం చోటు చేసుకుంది.
రెండు వర్గాలుగా...
బన్నీ ఉత్సవం సందర్భంగా మూడు గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, మరో ఐదు గ్రామాల ప్రజలు మరొక వర్గంగా ఏర్పడి యుద్ధరంగాన్ని తలపించేలా తలపడ్డారు. సంప్రదాయంగా వస్తున్న ఆచారం కావడంతో కర్రలతో సమరానికి దిగారు. అర్ధరాత్రి సమయంలో మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు రక్తమొచ్చేలా కొట్టుకున్నారు. ఈ సమరంలో వందల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన వంద పడకల తాత్కాలిక ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స అందించారు.
కర్రలతో కొట్టుకుని...
పోలీసుల ఆంక్షలు కూడా పనిచేయలేదు. ఎక్కడ చూసినా రక్తమోడింది. స్వామి వార్ల విగ్రహాల కోసం కొట్టుకోవడంతో రక్తం చింది అనేక మంది గాయపడ్డారరు. అయినా ఉత్సవానని ఆపలేదు. గాయడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు వారిస్తున్నా వారి సంప్రదాయాన్ని వీడేందుకు గ్రామస్థులు ఇష్టపడలేదు. ఉత్సవం జరిగిన తర్వాత చూస్తే అంతటా రక్తం కనిపిించింది. ఈ ఉత్సవానికి దాదాపు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.