వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2021-12-24 03:31 GMT

తెలుగు రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగి ప్రాంతంలో అత్యంత కనిష్టంగా నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, ఆదిలాబాద్ జిల్లాల్లో ని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు.

ఐదు రోజలుగా...
గత ఐదు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ కనీస ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలుగా నమోదయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News