చలి పంజా... వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

విపరీతమైన చలికి రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది

Update: 2021-12-23 04:07 GMT

విపరీతమైన చలికి రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో ఉదయం పది గంటలకు కూడా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఈ ప్రాంతాలన్నీ కర్ఫ్యూ ను తలపిస్తున్నాయి.

ఎన్నడూ లేని విధంగా....
గతంలో ఎన్నడూ లేని విధంగా చలితీవ్రత ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పిల్లలు, వృద్ధులు ఈ వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News