ఉండవల్లి కేసు నాలుగు వారాలు వాయిదా
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్ నాలుగు వారాలకు వాయిదా పడింది
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్ ను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులు 44 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కూడా తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లోనూ...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదని, అనేక రాష్ట్రాలతో ముడి పడి ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ స్కామ్ కు సంబంధించిన అంశాలు వెలుగు చూడాలంటే సీబీఐకి అప్పగించడమే మార్గమమని ఉండవల్లి అన్నారు. అయితే దీనిపై విచారణను నాలుగువారాల పాటు వాయిదా వేశారు.