Anna datha Sukhibhava : అన్నదాత సుఖీభవ లబ్దిదారులు ఏపీలో ఎంత మంది ఉన్నారంటే?
ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరువేల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా లబ్దిదారుల ఎంపిక పూర్తయింది;

ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరువేల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. మొత్తం మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది. అయితే పీఎం కిసాన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు పెట్టుబడి సాయాన్ని అన్నదాత సుఖీభవ పథకాన్నిఅందచేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు విధివిధానాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అన్నదాత సుఖీ భవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించింది. బడ్జెట్ లో ఈ నిధులను కేటాయించడంతో ఈ ఏడాది రైతులకు ఈ పథకం కింద నిధులు విడుదల చేయనుంది.
పీఎం కిసాన్ నిధులతో కలిపి...
అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధులు విడుదల చేసిన సమయంలో ఈ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించడంతో పీఎం కిసాన్ సమ్మాన్ నుంచి అందుతున్న వారే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. అంటే పీఎం కిసాన్ నిధులు ఎవరికైతే పడతాయో వారికే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అందే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రైతులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను జమ చేయనుండటంతో మొన్న ఫిబ్రవరి నెలలోనే కేంద్ర నిధులు పడ్డాయి. పీఎం కిసాన్ నిధులు మే లేదా జూన్ నెలలో పడే అవకాశముంది. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయనుంది.
పీఎం కిసాన్ నిధులు..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలతో పాటు మరో నాలుగు వేల రూపాయలను అన్నతాత సుఖీభవ పథకం కింది ఇచ్చే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పెట్టుబడి సాయం కింద మూడు విడతలుగా సాయం చేయాలని నిర్ణయించారు.అయితే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో ఏపీ నాలుగో స్థానంలో నిలిచినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి వెల్లడించారు. ఇక్కడ 60లక్షల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులుంటే 42లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ జారీచేసే పీఎం కిసాన్ నిధులు మంజూరు కానున్నాయి. మరో మూడు లక్షల మందికి పూర్తి చేసి 182 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ సాధనకు కృషి చేస్తున్నామన్నారు. 80% లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు గోదావరిచ శ్రీకాకుళం 78 శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉండగా, నెల్లూరు, అల్లూరి సీతారామ జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.