ఏపీకి బీజేపీ అగ్రనేతలు.. ప్లానేంటి ?

దేశంలో ప్రధాని మోదీ పాలనకు 9 వసంతాలు పూర్తైన సందర్భంగా.. ఏపీలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు..

Update: 2023-06-02 12:34 GMT

ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటన ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. జూన్ 8వ తేదీన అమిత్ షా విశాఖకు వస్తుండగా.. 10న తిరుపతికి జేపీ నడ్డా రానున్నారు. దేశంలో ప్రధాని మోదీ పాలనకు 9 వసంతాలు పూర్తైన సందర్భంగా.. ఏపీలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 0న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.

ఈ బహిరంగసభల్లో 9 ఏళ్ల పాలనలో ఏపీకి కేంద్రం నుంచి ఏం చేశాం ? ఎన్నివేల కోట్ల నిధులిచ్చాం? అన్నవాటిపై బహిరంగ సభల ద్వారా వివరించనున్నారు. కాగా.. రాష్ట్రంలో ఈ ఇద్దరి పర్యటనతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయి పొత్తులపై చర్చించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనతో పొత్తు ఖరారు చేస్తారా ? బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయా ? లేక బీజేపీ-జనసేన- టీడీపీ కలుస్తాయా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వీటిపై స్పష్టత రావాలంటే అమిత్ షా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.


Tags:    

Similar News