Telangana : సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయంపై ఫైర్ అయిన బండి
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి ఒకటేనని, చేతులు మారాయని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులను ఆందోళనలు చేస్తున్నారని, విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ లు చేస్తూ బీభత్సాన్నిసృష్టిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డగోలుగా అమ్ముతూ...
నాలుగు వందల ఎకరాల భూమిని విక్రయించుకునేందుకే అక్రమంగా, అడ్డగోలుగా అమ్ముకునేందుకు సిద్ధపడటం విచారకరమని బండి సంజయ్ అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. గతంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో పయనిస్తూ ప్రభుత్వానికి చెందిన భూములు అయిన కాడికి తెగనమ్మేందుకు సిద్ధపడటం విచారకరమని అన్నారు. కంచె గచ్చిబౌలిలో ఉన్న భూముల వేలాన్ని నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు.