ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు.. ఏపీ అధికారుల తీరుపై మంత్రి నిర్మలమ్మ అసహనం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఓచేదు అనుభవం ఎదురైంది. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఓచేదు అనుభవం ఎదురైంది. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన సీతారామన్ అధికారుల పనితీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 3వ తేదీన పరకాల ప్రభాకర్ తల్లి కాళికాంబ అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. దీంతో సాలూరులో జరిగిన కాళికాంబ పెద్దకర్మ కు నిర్మలా సీతారామన్ హాజరయ్యేందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ సాలూరు వస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం కూడా అందించారు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు. అయితే సీతారామన్ జిల్లాకు ఎందుకు వస్తున్నారో స్థానిక అధికారులకు కూడా పూర్తి స్థాయి సమాచారం లేదు. దీంతో మంత్రి కోసం ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో పాచిపెంట మండలం పనుకువలస లో ప్రధానమంత్రి జంజత్ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మలమ్మ వస్తున్నట్లు గ్రామంలో తెలియజేశారు.
నిర్మలమ్మ మరిది సుధాకర్ ఇంటికి సీతారామన్ వచ్చేసరికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పీతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడ పుష్పగుచ్ఛాలు పట్టుకొని వచ్చి రెడీగా ఉన్నారు. ఇది చూసిన మంత్రి నిర్మలమ్మ ఇంత హడావుడి దేనికోసం, అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆమె తీవ్రంగా మండిపడ్డారు. నా వ్యక్తిగత కార్యక్రమానికి వస్తే ఇలా హంగామా ఎందుకు చేస్తున్నారని, తాను ఎలాంటి అధికారక కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాలేదని.. ఎందుకిలా హడావుడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న అధికారులు మంత్రి నిర్మలమ్మకు క్షమాపణలు చెప్పారు.