తిరుమలలో అదే రద్దీ.. మరో ఎనిమిది రోజులు?

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

Update: 2023-01-04 02:56 GMT

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముందుగానే టిక్కెట్లు జారీ చేయడంతో భక్తులు ఉత్తర ద్వారం నుంచి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతుండటంతో ఈ పది రోజుల పాటు సర్వదర్శనం క్యూ లైన్ ల ద్వారానే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

హుండీ ఆదాయం...
వీఐపీ సీఫార్సు లేఖలను కూడా టీటీడీ రద్దు చేసింది. తిరుమలకు వచ్చే భక్లులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మంచినీరుతో పాటు అన్న ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,924 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 15,771 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.


Tags:    

Similar News