వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాలలో వైభవంగా జరుగుతున్నాయి
వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాలలో వైభవంగా జరుగుతున్నాయి. ఉదయన్నే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో వీఐపీలు తరించిపోయారు. తిరుమలలో రాత్రి 1.45 గంటలకే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమయింది. పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శననాన్ని భక్తులకు టీటీడీ కల్పించనుంది.
తిరుమలలో....
తిరుమలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, రంగనాధరాజు, అనిల్ కుమార్ యాదవ్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి తదతరులు దర్శించుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిట లాడిపోతున్నాయి.