భక్తులతో నిండిన తిరుమల కొండ

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు

Update: 2023-01-05 03:05 GMT

 TirumalaTirupati

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుని ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 11వ తేదీ వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతుంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రత్యేక కౌంటర్లను...
ఇందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఇప్పటికే ప్రతి రోజూ విడుదలవుతున్న టిక్కెట్లు ఆరోజే భక్తులు అందుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,116 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 18004 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News