Vasireddy Padma : వైఎస్ జగన్ ను దారుణంగా తిట్టిపోసిన వాసిరెడ్డి పద్మ.. వింటే షాకవుతారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆయన తీరును ఎండగట్టారు

Update: 2024-10-23 08:17 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆయన తీరును ఎండగట్టారు. తాను పార్టీకి రాజీనామా చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే అధికారంలో ఉన్న ప్పుడు నియంతగా వ్యవహరించడం, నేనే రాజు - నేను మంత్రి అన్నట్లు వ్యవహరించడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ప్రజా తీర్పు అలా వచ్చిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించారన్నారు. కార్యకర్తలు ఉన్నారన్న విషయమే మరిచిపోయి అధికారాన్ని చెలాయించారని వాసిరెడ్డి పద్మ అన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు తమ ప్రాణాలను, ఆస్తులను పణంగా పెట్టిన పార్టీ కార్యకర్తలను అధికారంలోకి రాగానే విసర్మించారన్నారు.

గుడ్ బుక్ అంటూ మరోసారి...
ఈరోజు గుడ్ బుక్ తెరుస్తానని చెబుతూ, ప్రమోషన్లు ఇస్తానని చెబుతూ అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.ఒక రాజకీయ పార్టీకి నడవడిక గాని, బాధ్యత గాని లేకుండా వ్యవహరిస్తే ఏమవుతుందో ప్రజలు తగిన సమయంలో చెబుతారని ఆమె అన్నారు. క్యాడర్ , నేతలనే కాదు పేదల పట్ల ఆయన వైఖరి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మారలేదన్నారు వాసిరెడ్డి పద్మ. బటన్ నొక్కి డబ్బులు పంచామని చెప్పుకోవడానికే తప్ప మద్యం పేరుతో దోచుకున్నారని దుయ్యబట్టారు. ప్రజా తీర్పు తర్వాత కూడా కార్యకర్తలను, ప్రజలను మోసం చేయాలని జగన్ చూస్తున్నారన్నారు. జగన్ పక్కన ఇక ఎవరూ ఉండరని, ఉండలేరని వాసిరెడ్డి పద్మ జోస్యం చెప్పారు. సమాజ పరంగా బాధ్యత లేకుండా వ్యవహరించినందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు

Tags:    

Similar News