టిటిడి కీలక నిర్ణయం.. ఆ వాహనాలకు నో ఎంట్రీ

తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఇతర మతాల గుర్తులు, దేవతా చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు..

Update: 2022-05-08 11:22 GMT

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం నాడు తిరుమలలో ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు ఉన్న వాహనాలను అనుమతించబోమని ప్రకటించింది. తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఇతర మతాల గుర్తులు, దేవతా చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు తీసుకెళ్లకూడదని టీటీడీ మరోసారి తెలిపింది. ఈ నియమం కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉందని తెలిపింది. అయితే ఈ నిబంధనను పట్టించుకోకుండా కొందరు భక్తులు ఇతర మతాలకు చెందిన చిహ్నాలు, రాజకీయ నేతలు, ప్రముఖుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు పెట్టుకుని తిరుమలకు వస్తున్నారని టీటీడీ పేర్కొంది. విజిలెన్స్‌ అధికారులు అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ.. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనదారులకు నిబంధనలను వివరించి స్టిక్కర్లు, జెండాలను తొలగించారు. ఈ ముఖ్యమైన నిబంధనను భక్తులు తెలుసుకుని నిర్వహణకు సహకరించాలని కోరారు.

ఇటీవల కాలంలో తిరుమల కు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది. కొన్ని వివాదాస్పదడం కూడా అయ్యాయి. విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసేసి కొండపైకి అనుమతిస్తోంది. తిరుమలకు ఉన్నపవిత్రతను పరిగణలోకి తీసుకొని నిబంధనలను కఠినంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
మరోవైపు సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వారపు సేవలను రద్దు చేసింది టీటీడీ. మంగళవారం రోజున నిర్వహించే అష్టదళపాదపద్మారాధన, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శనాలను రద్దు చేసింది. ఇప్పటికే వారాంతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయగా, ఇప్పుడు వారపు సేవలు కూడా రద్దు చేయడంతో సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం లభిస్తుందని టీటీడీ అధికారులు భావిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News