నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి అలక: గౌరవం లేనందున వేదిక వీడారు.

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేదిక పై నుంచి వెళ్లిపోయారు;

Update: 2024-11-03 12:27 GMT
vemireddy prabhakar reddy, mp, nellore, left the stage
  • whatsapp icon

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేదిక పై నుంచి వెళ్లిపోయారు. తనకు అవమానం జరిగిందని భావించి ఆయన అలిగి వెళ్లిపోవడంతో అధికారులు కంగు తిన్నారు. అయితే అధికారుల తప్పదం కారణంగానే వేమిరెడ్డి అలకకు కారణంగా చెబుతున్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. . రివ్యూ మీటింగ్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా బొకేలు సమర్పించి వేమిరెడ్డి పేరును విస్మరించారు.

మంత్రి సర్ది చెప్పినా...
దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేదికపై నుంచి అలిగి దిగి వెళ్లిపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేదికపై నుంచి కిందకు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన వినలేదు. స్టేజ్‌పై తనకు తగిన గౌరవం దక్కలేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంపీ వెంట కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా సభ నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తప్పుబట్టారు. మరోసారి ఇలా జరగకూడదని కలెక్టర్‌, అధికారులను మంత్రి ఆదేశించారు. వేమిరెడ్డి అలగడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News