వైసీపీపై ఆనం మరోసారి ఫైర్
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. తనకు సెక్యూరిటీ కావాలని తగ్గించారన్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. తనకు సెక్యూరిటీ కావాలని తగ్గించారన్నారు. గత టీడీపీ పాలనను, ఈ ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించారన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మంచి పాలనను ఈ పదిహేను నెలల్లోనైనా అందిస్తారేమో చూడాలన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో కొట్లాడుతున్నాయన్నారు.
తృతీయ ప్రత్యామ్నాయం...
ప్రజలు కోరుకుంటే తృతీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని తెలిపారు. టీడీపీ, వైసీపీ పాలనను ప్రజలు చూశారన్నారు. అయితే జాతీయ పార్టీలను ప్రజలు ఎంత మేర ఆదరిస్తారో చూడాల్సి ఉందన్నారు. మూడో ప్రత్యామ్నాయం ఉంటేనే మంచిదని తన అభిప్రాయమని ఆయన తెలిపారు. ఆధిపత్య పోరు అధికార పార్టీలో ఎక్కవుగా ఉందని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాబోయే పదిహేను నెలల్లో ఎవరు ఏమిటో తేలుతుందన్నారు. ప్రజలు సరైన ప్రత్యామ్నాయం లేకనే ప్రాంతీయ పార్టీల వైపు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.