జేపీసీని ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో విజయసాయి డిమాండ్

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు

Update: 2021-12-08 06:39 GMT

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడారు. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించేందుకు సంబంధిత భాగస్వామ్యులతో చర్చించేదుకు జేపీసీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మూడు సాగు చట్టాలను ప్రభుత్వం రద్దు చేసినా, రైతులకు కనీస మద్దతు ధరపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఏపీలో....
ఏపీలో జగన్ ప్రభుత్వం కనీస మద్దతు ధరపై చేతల్లో చూపించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్రం 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటిస్తే జగన్ ప్రభుత్వం దానికి అదనంగా మరో 24 వ్యవసాయ ఉత్పత్తులను చేర్చిందన్నారు. ఏపీలో ఇప్పుడు 47 పంటలకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉండేలా చట్టబద్ధమైన హమీ ఇవ్వాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.


Tags:    

Similar News