Vangaveeti Radha : వంగవీటికి సూపర్ న్యూస్.. తొలి జాబితాలో ఆయన పేరు.... అదిరిపోయే.... గిఫ్ట్ ఇవ్వనున్న చంద్రబాబు
విజయవాడ నేత వంగవీటి రాధాకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. త్వరలో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశముంది.
విజయవాడ నేత వంగవీటి రాధాకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. త్వరలో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశముంది. ఎమ్మెల్సీగా ఆయన పేరు తొలి జాబితాలోనే చంద్రబాబు నాయుడు ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే వంగవీటి రాధాకు సంకేతాలు కూడా అందినట్లు తెలిసింది. పార్టీని నమ్ముకుని ఉండటం, ఓటమిపాలయినా పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు ఎన్నికల సమయంలో టిక్కెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు వంగవీటి రాధాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. దీంతో కమ్మ, కాపు సామాజికవర్గాల కాంబినేషన్ పై సానుకూల వాతావరణం మరింత ఏర్పడే అవకాశముందని ఆయన ఈ డెసిషన్ కు వచ్చారని తెలిసింది.
ఇరవై ఏళ్ల నుంచి...
వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయన అధికార పార్టీలో ఉండటం. ఆ తర్వాత వంగవీటి రాధా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమిపాలయ్యారు. ఇక అప్పటి నుంచి రాధా రాజకీయంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ ఇంటి పేరుకు ఉన్న బ్రాండ్ కూడా ఆయనను ఏ రకంగానూ రాజకీయంగా ఎదగనివ్వలేకపోయింది ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడూ ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి మరోసారి తన జెండాను మార్చేశారు. అయితే 2019ఎన్నికల్లో వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించలేదు.
ఇచ్చిన హామీ మేరకు...
అధికారంలోకి వస్తే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో వంగవీటి రాధా చట్టసభలకు దూరంగానే ఉన్నారు. అంటే దాదాపు పదిహేనేళ్లుగా ఆయన చట్టసభల గడప తొక్కలేేకపోయారు. 2019 లో వైసీపీలో ఉండి ఉంటే ఎమ్మెల్సీ పదవి లభించేదేమో. కానీ ఆయన టీడీపీలోకి రావడం, పార్టీ ఓటమి పాలు కావడంతో ఆ ఆశ నెరవేరలేదు. ఇక 2024లోనూ ఆయన ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలని అనుచరులు వంగవీటి రాధాపై వత్తిడి తెచ్చారు. అయినా సరే ఆయన మాత్రం టీడీపీలో కొనసాగేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో తన స్నేహితులైన గుడివాడ, గన్నవరం వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంత బలవంతం చేసినా సరే వంగవీటి రాధా ససేమిరా అన్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన పనిచేశారు.
ఫస్ట్ లిస్ట్ లోనే...
దీంతో ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు ఫస్ట్ జాబితాలోనే వంగవీటి రాధాపేరు ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఎమ్మెల్సీగా ఆయన ఎంపికపై ఎవరిలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కావు. పైగా అమరావతి రైతుల ఉద్యమానికి కూడా రాధా సహకరించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాధాను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న సంఖ్యాబలం చూస్తే ఏ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా అది కూటమి ఖాతాలోనే పడుతుంది. పోటీయే ఉండదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలుంటాయి. శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమికే రానుండటంతో అందులో ఫస్ట్ పేరు వంగవీటి రాధా పేరు ఉందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.