బాలిక ఆత్మహత్య కేసు.. వినోద్ జైన్ ఇల్లు సీజ్

వినోద్ జైన్ ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలిక ఎవరికీ ఫిర్యాదు చేయకుండా నేరుగా చనిపోవ

Update: 2022-01-31 07:39 GMT

విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసు.. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలిక సూసైడ్ నోట్ లో తన చావుకు కారణం లైంగిక వేధింపులే అని పేర్కొంది. బాలిక ఆత్మహత్య అనంతరం ఆమె తల్లిదండ్రులు టీడీపీ నేత వినోద్ జైన్ పై అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు అతనితో పాటు కుటుంబ సభ్యులనూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా లోటస్ లోని వినోద్ జైన్ ఇంటిని పరిశీలించారు పోలీసులు. ఇంట్లో అన్ని చోట్ల సోదాలు నిర్వహించిన అనంతరం ఇంటిని సీజ్ చేశారు. బాలిక సూసైడ్ విషయం తెలిశాక.. వినోద్ జైన్ ఎవరెవరితో మాట్లాడాడు. ఈ సూసైడ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

వినోద్ జైన్ ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలిక ఎవరికీ ఫిర్యాదు చేయకుండా నేరుగా చనిపోవడానికి బెదిరింపులే కారణమా.? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. విజయవాడలోని భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్‌ వద్ద గల ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. కొద్దిరోజులుగా తనన ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని నోట్ బుక్‎లో రాసి.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఈ ఘటనపై స్పందించింది. వినోద్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.


Tags:    

Similar News