Godavari Express : గోదావరి ఎక్స్‌ప్రెస్ కు నేటితో యాభై ఏళ్లు
విశాఖ - గోదావరి ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌కు నేటితో యాభై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు
విశాఖ - గోదావరి ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌కు నేటితో యాభై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విశాఖలోని రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, రైల్వే అధికారులు రైలు వద్ద కేక్ కట్ చేసి పండగ చేసుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రయాణిస్తూ నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. తొలిసారి ఈ ట్రెయిన్ నెంబరు 7007, 7008 గా ఉంది. ప్రస్తుతం ఈ రైలు నెంబరు 127,27, 12728 గా మార్చారు.
1974లో ప్రారంభమై....
1974 ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ రైలు మొదటి సారి విశాఖ - హైదరాబాద్ మధ్య పట్టాలపై పరుగులు తీసింది. విశాఖ నుంచి హైదరాబాద్ మధ్య మొత్త పద్దెనిమిది స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మొత్తం 710 కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తుంది. విశాఖ నుంచి హైదరాబాద్ కు చేరుకునే సమయం పన్నెండు గంటలు. ఈ రైలు యాభై వసంతాలు పూర్తి చేసుకోవడంతో భారత దక్షిణ మధ్య రైల్వే అధికారులు గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు.