ఒక్క సంతకంతో 13 మంది మృతి.. అసలు విషయం తెలిస్తే షాకే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరుగనుండగా, ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటరు లిస్ట్‌లో జాబితా

Update: 2023-11-09 03:21 GMT

Visakhapatnam: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరుగనుండగా, ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటరు లిస్ట్‌లో జాబితా లేని వారు కొత్తగా నమోదు చేసుకునేందుకకు అవకాశం ఉంది. లేనివారు ఓటరు నమోదు కోసం ఆయా మీ సేవ కేంద్రాలు, ఇతర ఆన్‌లైన్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఈ గ్రామంలో ఒకేసారి 13మంది చనిపోయారు. కారణం అనారోగ్యం కాదు. ఓ అధికారి నిర్లక్ష్యం కారణంగా ఒక్క సంతకంతోననే చంపేశారు. ఏంటి సంతకంతో ఇంత మందిని చంపేయడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా..? ఈ వార్త వింటే ఇది నిజమా..? ఎలా సాధ్యం.. అంటూ షాకవ్వక తప్పదు. అసలు వివరాలకొస్తే..

ఓటు హక్కు కోల్పోయిన 13మంది:

ఇది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొవ్వూరు. ఈ గ్రామంలో చాలామంది ఓటర్లే ఉన్నారు. అయితే బూత్‌ లెవల్‌ ఆఫీసర్ (బీఎల్‌ఓ) సంతకం.. ఆ గ్రామంలోని 13 మందిని బతికుండగానే చంపేసింది. వాళ్లు బతికున్నప్పటికీ.. చనిపోయినట్టు ఓటర్ రికార్డులో నమోదయింది. దీంతో ఓటర్ల లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించేశారు. ఆ 13మంది ఓటు హక్కును కోల్పోయారు. 

బాధితుల ఫిర్యాదు:

విషయం తెలుసుకున్న బాధితులు.. అవాక్కయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై బంటు రాజు అనే వ్యక్తి.. అధికారులకు ఫిర్యాదు చేశాడు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు.కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన అధికారులు.. విచారణలో బూత్ నెంబర్ 20లో బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రభావతి నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగినట్లు గుర్తించారు. ఓటర్లు బతికే ఉన్నప్పటికీ వాళ్లంతా చనిపోయారని నిర్ధారిస్తూ, ఫామ్‌ సెవెన్‌లో.. సంతకాలు తానే పెట్టి ఆ 13మందిని ఓటర్ల లిస్ట్ నుంచి ఆమె తొలగించినట్టు అధికారుల విచారణలో బట్టబయలైంది.

ప్రభావతి సస్పెన్షన్‌:

అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదని చెబుతోంది బూత్‌ లెవల్‌ ఆఫీసర్ (బీఎల్ఓ) ప్రభావతి. చనిపోయిన వ్యక్తికి సంబంధించి.. సంతకాలు చేసేందుకు ఆ కుటుంబంలోని వారిని పిలిచినప్పటికీ రాకపోవడంతో.. ఆయా డాక్యుమెంట్లను సమర్పించేందుకు గడువు ముగుస్తుండడంతో తానే సంతకాలు చేసి సమర్పించినట్టు ప్రభావం అధికారుల విచాణలో అంగీకరించారు. దీంతో ప్రభావతిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఒకేసారి ఇంతమందిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు ఎలా తొలగించారు అనేదానిపై అధికారి వివరణ ఇచ్చినప్పటికీ.. ఒకేసారి అంత మంది చనిపోయారంటూ ఎలా నిర్ధారించారని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు మరణించారంటూ ఓటరు లిస్టు పై తొలగించిన ఆ 13 మంది పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు గ్రామస్తులు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోవద్దని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News