విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత

విశాఖపట్నం రైల్వేస్టేషన్ అధికారులు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ స్టేషన్ లోకి ఎవరికి అనుమతించరు

Update: 2022-06-18 02:54 GMT

విశాఖపట్నం రైల్వేస్టేషన్ అధికారులు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ స్టేషన్ లోకి ఎవరికి అనుమతించరు. విశాఖలో ఆర్మీ అభ్యర్థులు ఈరోజు ర్యాలీ తీస్తున్నారు. ప్రదర్శనగా వచ్చే ఆర్మీ అభ్యర్థులు స్టేషన్ లోకి చొరబడే అవకాశముందని ఇంటలిజెన్స్ శాఖ హెచ్చరించింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ రైల్వే స్టేషన్ ను మూసివేశారు. విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ఐదంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

రైళ్ల నిలిపివేత....
గోదావరి, గరీబ్ రథ్, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లు ఇప్పటికే నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రైళ్లన్నంటినీ దారి మళ్లిస్తున్నారు. విశాఖకు వచ్చే రైళ్లన్నింటని దువ్వాడ, అనకాపల్లి స్టేషన్లలో నిలిపేస్తున్నారు. దీంతో ఒడిశా, బెంగాల్ వైపు వెళుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పరిస్థితిని బట్టి విశాఖపట్నం స్టేషన్ నుంచి రైళ్లను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News