Vande Bharat Trains: ఏపీకి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఏయే రూట్లలో వెళ్తుందంటే..
ఏపీలో మరో వందేభారత్ రైలు పరుగులు తీసేందుకు సిద్దమైంది. ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య
ఏపీలో మరో వందేభారత్ రైలు పరుగులు తీసేందుకు సిద్దమైంది. ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతుండగా.. ఇప్పుడు మరో రైలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైళ్లు రోజురోజు మరింతగా విస్తరిస్తున్నాయి. అయితే భువనేశ్వర్-విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రూట్‌లో వందేభారత్ ట్రయిల్ రన్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ఉన్న 443 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ఆరున్నర గంటల్లో కవర్ చేయనుంది.
సమయ వేళలు:
కాగా, ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సమయ వేళలు చూద్దాం.. ప్రతీ రోజూ ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి .. విశాఖపట్నం స్టేషన్‌కు ఉదయం 11 గంటలకు చేరుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి సాయంత్రం 3.45 గంటలకు బయలుదేరి భువనేశ్వర్ రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది.
భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వందేభారత్.. ఖుర్దారోడ్, బరంపూర్, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం మీదుగా విశాఖపట్నానికి చేరుతుంది. విశాఖ నుంచి బయలుదేరేటప్పుడు కూడా ఈ రూట్ల మీదుగానే వెళ్తుంది.