నా ఫ్యామిలీ కిడ్నాప్ ను కూడా రాజకీయం చేస్తే ఎలా? : ఎంపీ ఎంవీవీ

తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన హేమంత్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ స్పష్టం చేశారు. తన కుటుంబం కిడ్నాప్..

Update: 2023-06-21 10:57 GMT

mp mvv satyanarayana family kidnap case

తన భార్య, కుమారుడితో పాటు.. కుటుంబ సన్నిహితుడు కిడ్నాప్ వ్యవహారంపై వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. జరిగింది వివరించారు. జూన్ 12 తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటిలోకి వచ్చి, క్రూరంగా హింసించి వారి నుంచి డబ్బులు వసూలు చేశారన్నారు. మూడు రోజులపాటు రెక్కీ చేసి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారని తెలిపారు. పోలీసులు హేమంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారని, అతనిపై 13 కేసులు, రాజేశ్ అనే మరో నిందితుడిపై 40కి పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు.

తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన హేమంత్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ స్పష్టం చేశారు. తన కుటుంబం కిడ్నాప్ వ్యవహారంతో విశాఖలో రక్షణ లేదనడం సరికాదని, కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించారని తెలిపారు. ఏ ప్రభుత్వ హయాంలోనైనా.. కిడ్నాప్ లు, హత్యలు, నేరాలు జరుగుతాయని.. వాటిని కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు.
తనకు కొన్ని వ్యాపారాలున్నాయని, వాటిని వక్రీకరిస్తున్నారనే తెలంగాణలో వ్యాపారం.. సేవలు ఇక్కడి నుంచి అని చెప్పినట్లు వివరించారు. తన వల్ల ప్రభుత్వానికి, సీఎం జగన్ కు చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశంతోనే తన వ్యాపారాలను తెలంగాణలో చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎంపీ ఎంవీవీ చెప్పుకొచ్చారు. కుటుంబం వేరు.. రాజకీయం వేరు అన్న ఎంవీవీ.. తన కుటుంబం కిడ్నాపై చావు అంచుల వరకూ వెళ్లొస్తే.. దానిని కూడా రాజకీయం చేయడాన్ని తప్పుబట్టారు. కిడ్నాప్ వెనుక కుట్ర ఉందన్న ఆరోపణలు దురదృష్టకరమన్నారు.


Tags:    

Similar News