విశాఖ‌కు పరిపాల‌న రాజ‌ధాని ఖాయమనేశారు..!

ఈ విష‌యంలో ఎవ‌రు ఆపినా విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని ఆగ‌దని.. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌ల‌కిందులు

Update: 2022-06-23 11:40 GMT

ఏపీలో రాజధానుల అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే..! మూడు రాజధానులు తప్పకుండా ఉంటాయని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. తాజాగా విశాఖ‌కు ఏపీ ప‌రిపాల‌నా రాజ‌ధాని వ‌చ్చి తీరుతుంద‌ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ విష‌యంలో ఎవ‌రు ఆపినా విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని ఆగ‌దని.. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌ల‌కిందులు త‌ప‌స్సు చేసినా విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధానిని అడ్డుకోలేర‌న్నారు.కాలువ‌లు, చెరువులు, న‌దులు ఆక్ర‌మించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని.. టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు చెరువు కాలువ‌ను ఆక్ర‌మించార‌న్న సాయిరెడ్డి.. అయ్య‌న్న‌కు హైకోర్టులో తాత్కాలికంగా స్టే ద‌క్కి ఉండొచ్చ‌న్నారు. అయ్య‌న్న ఆక్ర‌మ‌ణ‌ల విష‌యాన్ని అధికారులు చూసుకుంటార‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఎవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యంపై తాము ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ఈ విష‌యంలో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌నే నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆయ‌న తెలిపారు. అయినా అణ‌గారిన వర్గాల‌కు అత్యున్న‌త ప‌ద‌వులు ఇస్తామంటే ఎవ‌రు కాదంటార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News