తెల్లవారుజామునుంచే పింఛన్లు పంపిణీ
తెల్లవారు జామునుంచే పింఛన్లను వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ పింఛన్ల ను పంపిణీ చేస్తున్నారు
ఈరోజు తెల్లవారు జామునుంచే పింఛన్లను వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలయింది. డిసెంబరు 1వ తేదీ కావడంతో పింఛన్ల కార్యక్రమాన్ని వాలంటీర్లు తెల్లవారు జామునే ప్రారంభించారు. ఉదయం 7.30 గంటల వరకూ 33.29 పింఛన్లను అందచేసినట్లు పంచాయతీరాజ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు.
ఉదయం 7.30 గంటలకు...
ఉదయం 7.30 గంటలకు 20.74 లక్షలమందికి 527.02 కోట్లు అందచేసినట్లు తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 62,31 లక్షల మంది పింఛనుదారులకు 1,584 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం పింఛన్ల పంపిణీ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశం మేరకు పింఛను కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.