ఏపీలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లోని డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ లోని డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉండగా ఇందులో పురుషులు 1,98,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 68,158 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 9వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి జిల్లాలో రాజకీయ పార్టీలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది జనవరి 6 నుంచి ఈ ఏడాది ఆగస్ట్ 30 వరకు ఓటర్ల జాబితా సంస్కరణను చేపట్టామని చెప్పారు. జీరో డోర్ నంబర్ తో 2,51,767 ఓట్లు ఉన్నట్టు గుర్తించామని... 1,57,939 ఇళ్లలో 10 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్టు తేలిందని చెప్పారు.
మొత్తం ఓటర్లు- 4,01,53,292
పురుషులు- 1,98,31,791
మహిళలు - 2,03,85,851
ట్రాన్స్ జెండర్లు - 3808
సర్వీస్ ఓటర్లు 66,158
పోలింగ్ కేంద్రాలు - 46,165