Andhra Pradesh : కొనసాగుతున్న పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఐదు గంటలకు 68 శాతం పోలింగ్ నమోదయింది

Update: 2024-05-13 12:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇంకా అరగంట మాత్రమే సమయం ఉండటంతో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో పెద్దయెత్తున మహిళలు, యువకులు ఓట్లు వేసేందుకు వేచి ఉన్నారు. భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. అయితే క్యూ లైన్ లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి అందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా నడుస్తుందని చెబుతున్నారు.

ఐదు గంటలకు...
ఆంధ్రప్రదేశ్ లో ఐదు గంటలకు 68 శాతం పోలింగ్ నమోదయింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరో పదిహేడు శాతం పోలింగ్ జరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇప్పటికే క్యూ లైన్ లో ఓటర్లు నిల్చుని ఉండటంతో వారందరూ ఓటు వేయడానికి కనీసం నాలుగైదు గంటల సమయం పట్టే అవకాశముంది. అందుకే పోలీసులు అరగంటలోపు వచ్చే వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. పార్టీల అభ్యర్థులు ఓటు వేయని వారిని గుర్తించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.


Tags:    

Similar News