అవసరమైతే ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేస్తాం : హోంమంత్రి వనిత

విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

Update: 2022-04-14 11:51 GMT

విజయవాడ : ఏలూరు జిల్లా పరిధిలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడి విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలను ఉపేక్షించబోమని, అలాంటి పరిశ్రమలను ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. ప్ర‌జ‌లకు మేలు చేయాల‌ని, మెరుగైన ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న భావ‌న‌తోనే ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని, అవే ప్రజలకు హాని చేస్తే ఉపేక్షించబోమన్నారు.

అగ్నిప్రమాద ఘటన అనంతరం అక్కిరెడ్డిపల్లె వాసులు కెమికల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని కోరారని, దానిపై గంటల వ్యవధిలోనే నివేదిక సిద్ధం చేసినట్లు మంత్రి వనిత తెలిపారు. ఆ నివేదిక ప్రకారమే కంపెనీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షలు, కంపెనీ తరపున రూ.25 లక్షలు మొత్తం రూ.50 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.


Tags:    

Similar News