Rain Alert : రేపు ఏపీలో వర్షాలు

రేపు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది;

Update: 2023-11-14 13:51 GMT
rain,  meteorological department, two telugu states, two days, meteorological department said  there is a chance of rain in two telugu states, rainalert in telangana today, rain alert in andhra pradesh today

Ap weather updates

  • whatsapp icon

రేపు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో రేపు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతమయి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మత్స్యాకారులు చేపలవేటకు...
రేపటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి ఈ నెల 16వ తేదీకి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించింది. శుక్రవారం నాటికి ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది. ఈ ప్రభావంతో రేపు కోస్తా జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్ల రాదని కూడా హెచ్చరికలు జారీ చేసింది.


Tags:    

Similar News