రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరిక చేసింది. వాయవ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని పేర్కొంది
భారత వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేసింది. వాయవ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని పేర్కొంది. ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. 48 గంటల్లో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈదురు గాలులు...
ఈ రెండు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు, ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ కోస్తాంధ్రలో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.