మరోసారి తడిసి ముద్దవ్వనున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు మరోసారి తడిసి ముద్దవ్వనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు

Update: 2023-08-13 02:37 GMT

తెలుగు రాష్ట్రాలు మరోసారి తడిసి ముద్దవ్వనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కూడా వర్షసూచన జారీ చేరింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీ తీరాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఉంది. దీనితో పాటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వానలు కురుస్తాయని అంచనా వేసింది. 14వ తేదీన చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఆగస్టు 15న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, విజయనగరం జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తున్నాయి.

మూడు రోజుల పాటూ తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో మయన్మార్, బంగ్లాదేశ్ పైన మేఘాలు ఆవహించి ఉన్నాయి.. అవి తెలుగు రాష్ట్రాలవైపు కదులుతున్నాయి. వాటి వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు నల్గొండ, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 71 మిల్లీ మీటర్ల వర్షపాతం నమాదైంది. యాదాద్రి జిల్లా నందనంలో 53 మి.మీ, ఖమ్మం జిల్లా లింగాలలో 43 మి.మీ, రావినూతల, తిమ్మారావుపేటలలో 42 మి.మీ , మధిరలో 39 మి.మీ, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మి.మీ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


Tags:    

Similar News