ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు.. భారీ వరదలు రాబోతున్నాయా..?

Update: 2022-10-15 03:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూపర్ సైక్లోన్ కారణంగా ఏపీకి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం…ఏర్పడనుందని ఆ తర్వాత ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనం కానుందని.. ఆ తర్వాత తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ఏర్పడితే సిత్రంగ్(sitrang) గా నామకరణం చేయనున్నారు. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం ఉండనుందని గుర్తించారు.

నైరుతి రుతుపవనాల కారణంగా మధ్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవనున్నాయి. అక్టోబరు 18 వరకు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, మాహేలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని ప‌లు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్టోబరు 18 వరకు భారీ వర్షంతో కూడిన వర్షపాతం న‌మోదుకానుంది. మ‌రో మూడు రోజులు వర్షాలు కురిసే ప్రాంతాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, మాహేలో వంటి ప్రాంతాలు ఉన్నాయి.


Tags:    

Similar News