అంబులెన్స్ డ్రైవర్ల మాఫియాకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టేసినట్లేనా..?

అంబులెన్స్‌ మాఫియాపై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబులెన్స్‌లకు చార్జీలను ఫిక్స్‌ చేస్తూ ప్రత్యేక ఆర్డర్స్‌ ఇచ్చింది.

Update: 2022-04-28 05:11 GMT

తిరుపతి : ఇటీవల రుయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసు‌లు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌ను గుర్తించి వారిపై కేసులు న‌మోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారు. తిరుప‌తి రుయా ఆసుప‌త్రిలో చ‌నిపోయిన బాలుడి మృత‌దేహాన్ని త‌ర‌లించే విష‌యంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా దందాపై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. మరోమారు ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడదని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్దారు. ఇలాంటి చిన్న‌ఘ‌ట‌న‌లే మొత్తం వ్య‌వ‌స్థ‌నే అప్ర‌తిష్ట పాలు చేస్తాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

అంబులెన్స్‌ మాఫియాపై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబులెన్స్‌లకు చార్జీలను ఫిక్స్‌ చేస్తూ ప్రత్యేక ఆర్డర్స్‌ ఇచ్చింది. అంబులెన్స్ దందా పై జిల్లా కలెక్టర్‌తో ఆర్డీఓ, డీఎంహెచ్ ఓ, ఆర్టీఓలు సమావేశమయ్యారు . ఈ సమావేశం తర్వాత ఓ రిపోర్ట్‌ను కలెక్టర్‌కు సమర్పించారు. చార్జీల వసూలు, నిర్వహణపై వచ్చిన ఫిర్యాదులపై అంబులెన్స్ డ్రైవర్లు, ఆపరేటర్లతో సమావేశమై తీసుకున్న నిర్ణయాలను కలెక్టర్ కు వివరించారు అధికారులు. అంబులెన్స్ చార్జీలను అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నిర్దేశించిన రేట్ల అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అంబులెన్సు నిర్వాహకులు వసూలు చేయాల్సిన చార్జీల వివరాలను ధరల పట్టికలను ఆస్పత్రుల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.


Tags:    

Similar News