Ys Jagan : నేడు శాసనసభకు జగన్ వస్తారా? రారా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శాసనసభకు వస్తారా? రారా? అన్న దానిపై సందేహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శాసనసభకు వస్తారా? రారా? అన్న దానిపై సందేహం నెలకొంది. నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో ఆయన హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత శాసనసభకు వస్తారా? రారా? అన్న దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. ఆయన వచ్చినా సాధారణ సభ్యుడి మాదిరిగానే సభలో కూర్చోవాల్సి ఉంటుంది. సాధారణ సభ్యుడిలాగానే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
సాధారణ సభ్యుడిగానే...
ఈరోజు నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీకి రావడంతో జగన్ ను సాధారణ సభ్యుడిగానే పరిగణిస్తారని చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో సాధారణ సభ్యుడి మాదిరిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి రావడంతో ఆయనకు సభకు వచ్చే విషయంలో సందేహాలు ఉన్నాయి.