తిరుమలకు జగన్ వచ్చే వేళ భూమన హెచ్చరిక
తిరుమలకు రానున్న జగన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా? అని పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు
తిరుమలకు రానున్న జగన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా? అని పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటని భూమన ప్రశ్నించారు. హిందూ ధర్మం అంటే ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతామని తెలిపారు. ఎంత నిర్భంధానికి గురి చేస్తే అంత పైకి లేచి ప్రజా గొంతుకను వినిపిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంతకైనా తెగించడానికి చంద్రబాబు సిద్దపడతారని అన్నారు. తిరుమల ప్రసాదంపై వేయి నాలుకలతో మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. గతంలోనూ అనేక సార్లు జగన్ తిరుమలకు వచ్చారని భూమన గుర్తు చేశారు. అనేక మార్లు వచ్చిన జగన్ కు డిక్లరేషన్ ఏంటన్నది ఆయన ప్రశ్నించారు.
వ్యక్తిగత రాజకీయాల్లోకి...
వ్యక్తిగత రాజకీయాల్లోకి శక్తిమూర్తిని తీసుకు రావద్దని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చాలా పాపం చేశారని అన్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం అని భూమన ప్రశ్నించారు. కూటమి నేతలు తలా ఒకటి నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. అలిపిరిలోనే నిలదీస్తామని హెచ్చరికలు జారీ చేయడం ఎంత వరకూ సబబని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. రేపు పూజలు చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. బీజేపీ నేతలు ఒక్కరే హిందువులా? అని ఆయన నిలదీశారు. హైందవ సంస్కృతిని గురించి మాట్లాడే వాళ్లు సనాతన ధర్మం పేరిట కొత్త అవతారం ఎత్తారని భూమన అన్నారు. ఎవరో చెబితే హిందువులు అనిపించుకోవడానికి సిద్ధంగా లేమని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు జగన్ ను సాదరంగా తిరుమలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.