Andhra Pradesh : సెలవుపై వెళుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ప్రభుత్వం మారడంతో?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో కొందరు అధికారులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో కొందరు అధికారులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. కొందరు తిరిగి కేంద్ర సర్వీసుకు వెళ్లేందుక ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని పేరుపడిన ఐఏఎస్, ఐపీఎస్ లు తమకు ఇంకా పదవీ విరమణకు సమయం ఉండటంతో ఈ ఐదేళ్ల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అనేక మంది కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అందులో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు మరికొందరు జూనియర్ లు కూడా ఉన్నారని తెలిసింది.
విదేశాలకు వెళ్లేందుకు...
అయితే సీఐడీ అడిషనల్ డీఐజీ సంజయ్ మాత్రం సెలవుపై ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకూ ఆయన సెలవు పెడుతూ చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరక తనను విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆయన కోరారు. దీనికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనుమతించారు. సీఐడీ అడిషనల్ డీఐజీ సంజయ్ చంద్రబాబు పై అనేక కేసులు పెట్టడంతో పాటు ఆయనను అరెస్ట్ చేసిన దాంట్లో కీలకంగా వ్యవహరించారు.
కేంద్ర సర్వీసుల్లోకి...
దీంతో ఆయన ప్రభుత్వం మారడంతో సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇక మరో ఐఏఎ్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇలా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లు కొందరు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వీసు వదులుకోవడం ఇష్టం లేని కొందరు కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింద.ి