హమయ్య.. రష్ తగ్గింది

వరస సెలవులు పూర్తి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఇప్పుడు భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది

Update: 2023-10-03 02:59 GMT

వరస సెలవులు పూర్తి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఇప్పుడు భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. పెరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి మాత్రం ఇంకా అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. తమిళనాడు భక్తులతో కొంత క్యూలైన్లు నిండిపోయి ఉన్నప్పటికీ గత మూడు రోజుల నుంచి పోల్చుకుంటే చాలా వరకూ రద్దీ తగ్గినట్లేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 80,551 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరిలో 32,028 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి పది హేను గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఈరోజు నుంచి క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ తగ్గే అవకాశముంది.


Tags:    

Similar News