కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం

కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన 24 గంటలోపే కేంద్ర జనగణన శాఖ అభ్యంతరం తెలిపింది

Update: 2022-01-28 05:54 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం  కొన్ని సూచనలు చేసింది.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన 24 గంటలోపే కేంద్ర జనగణన శాఖ అభ్యంతరం తెలిపింది. జనగణన పూర్తయ్యేంత వరకూ జిల్లా సరిహద్దులు మార్చడానికి లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. జిల్లా సరిహద్దులు మారిస్తే జనగణన సాధ్యం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు.

జిల్లా సరిహద్దులను...
ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి నెల రోజుల సమయం ఇచ్చింది. ఉగాది నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కోవిడ్ దృష్ట్యా జనగణన సాధ్యం కాలేదని, ఈ ఏడాది జూన్ వరకూ జిల్లా సరిహద్దులను మార్చవద్దని కోరింది. ఒకవేళ జిల్లా సరిహద్దులను మార్చాల్సి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని జనగణన శాఖ కోరింది. జిల్లాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. జనగణన ప్రారంభమయిన తర్వాత ఏర్పడిన జిల్లాల అనుసరించే సర్వే జరగనుంది. 


Tags:    

Similar News