ప్రధాని పర్యటన నేపథ్యంలో.. విశాఖ కార్మికులు?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు భారీ ర్యాలీని నిర్వహించారు

Update: 2022-11-09 04:22 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు భారీ ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రయివేటీకరణ చేయవద్దంటూ వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు.

అడ్డుకున్న పోలీసులు...
అయితే ఈ నెల 11న విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో ఆందోళనను ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కార్మికులు బైక్ ర్యాలీని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీగా బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News